![]() |
![]() |

తనను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాను 2019-2020 ప్రాంతంలో 'రక్షణ' మూవీ చేశానని, కానీ అది విడుదల ఆలస్యమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల తాను సక్సెస్ లో ఉండటంతో.. ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేసి, నిర్మాతలు లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపింది. అంతేకాదు తనకి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వకపోగా, ప్రమోషన్స్ కి రమ్మంటున్నారని.. తన టీంతో మాట్లాడిస్తే, తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తాం అంటున్నారని చెప్పుకొచ్చింది.
అయితే 'రక్షణ' సినిమా విషయంలో పాయల్ వెర్షన్ ఒకలా ఉంటే.. మేకర్స్ వెర్షన్ మరోలా ఉంది. ఆ సినిమా నిర్మాతకు మద్దతుగా తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. కోవిడ్ కారణంగా సినిమా ఆలస్యమైందని, అన్ని అడ్డంకులను దాటుకొని సినిమాని పూర్తి చేశామని నిర్మాత చెప్పినట్లుగా ఆ నోట్ లో ఉంది. ఈ సినిమా కోసం 50 రోజులు వర్క్ చేసేలా పాయల్ అగ్రిమెంట్ చేయగా, 47 రోజుల్లోనే ఆమె పోర్షన్ కంప్లీట్ చేశారట. అంతేకాదు, పాయల్ కి ఇవ్వాల్సింది రూ.6 లక్షలు అని.. ప్రమోషన్స్ కి వస్తే అవి కూడా ఇస్తామని తెలుపుతూ, ఆమె పేరు మీద చెక్ రాసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఇచ్చారట.

పాయల్ కి, 'రక్షణ' నిర్మాతకి మధ్య సమస్యని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ఎంతో ప్రయత్నిచిందట. ఆమె మేనేజర్ ని సంప్రదించగా.. ఆయన నుంచి పాజిటివ్ స్పందన లేదని మండలి తెలిపింది. తాము సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించగా సరైన స్పందన లేకపోగా.. సోషల్ మీడియాలో ఆమెని బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు పాయల్ పోస్ట్ పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు నిర్మాతల మండలి పేర్కొంది.

![]() |
![]() |