![]() |
![]() |
.webp)
‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం నాడు తెలుగువన్ కుటుంబం సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. నిజానికి కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు ఆదివారం, మే 19. నిన్న వారాంతపు సెలవు కావడం వల్ల ఆయన తెలుగువన్ ఫ్యామిలీ మెంబర్లందరి నుంచి ‘డిజిటల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అందుకున్నారు. సోమవారం నాడు తెలుగువన్ కుటుంబం సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. కంఠంనేని రవిశంకర్ గత పాతికేళ్ళుగా తన పుట్టినరోజు వేడుకలను తెలుగువన్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా తెలుగువన్ కుటుంబ సభ్యుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న కంఠంనేని రవిశంకర్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
.webp)
అనంతరం కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ‘‘ఇది నాకు 25వ పుట్టినరోజు. అంటే, ‘ఆబ్జెక్ట్ వన్ సంస్థను స్థాపించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘తెలుగువన్’ స్థాపించి వచ్చే ఏడాదికి పాతికేళ్ళు పూర్తవుతాయి. వచ్చే ఏడాది తెలుగువన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం. దేశంలోనే పాతికేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నమొట్టమొదటి డిజిటల్ మీడియా సంస్థగా తెలుగువన్ నిలవబోతోంది. ఈ పాతికేళ్ళ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన తెలుగువన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో ఆబ్జెక్ట్ వన్ డైరెక్టర్ కంఠంనేని హిమబిందు కూడా పాల్గొన్నారు.
.webp)

.webp)

.webp)
![]() |
![]() |