![]() |
![]() |

'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో తక్కువ సమయంలోనే యూత్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. టాలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ అనే అభిప్రాయాన్ని కలిగించాడు. అయితే కొంతకాలంగా విజయ్ కి అంతగా టైం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. భారీ సినిమాలు ఆగిపోతున్నాయి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'పై ఎన్నో అంచనాలు పెట్టుకోగా.. అది డిజాస్టర్ అయింది. ఆ దెబ్బకి పూరి-విజయ్ కాంబోలో రావాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'జనగణమన' ఆగిపోయింది. అలాగే మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉండగా.. అదసలు ఏమైందో కూడా తెలీదు. ఇలాంటి టైంలో విజయ్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
'పుష్ప' విడుదల కాకముందే.. విజయ్-సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చింది. అయితే 'పుష్ప' విడుదలై సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోవడం.. 'పుష్ప-2' పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండి, సుకుమార్ తో సినిమా చేయడానికి బడా బడా స్టార్స్ ఆసక్తి చూపిస్తుండటంతో.. ఇక విజయ్ సినిమా ఆగిపోయినట్లేనని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే తన తదుపరి సినిమాని రామ్ చరణ్ (Ram Charan) తో ప్రకటించాడు సుకుమార్. దీంతో ఇక విజయ్ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు విజయ్-సుకుమార్ కాంబినేషన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. వీరి కాంబో మూవీ ఆగిపోలేదట. రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక విజయ్ తో సుకుమార్ సినిమా చేస్తాడని తెలుస్తోంది. హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన న్యూ మూవీ 'గం గం గణేశా' కూడా ఇదే బ్యానర్ లో రూపొందడం విశేషం.
![]() |
![]() |