![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. 'పుష్ప-2' టీజర్ విడుదలైంది. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ పూనకాలు తెప్పించేలా ఉంది.
అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 8) కానుకగా నేడు 'పుష్ప-2' టీజర్ ను విడుదల చేశారు. గంగమ్మ జాతరలో అర్ధనారీశ్వర రూపంలో బన్నీ దర్శనమిచ్చాడు. కాళ్ళకి గజ్జెలు కట్టి, చేత త్రిశూలం పట్టి, శంఖం ఊదుతూ అల్లు అర్జున్ పాత్రని పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. బన్నీ స్క్రీన్ ప్రజెన్స్, సుకుమార్ మార్క్ మేకింగ్, అదిరిపోయే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. ఫుల్ ట్రీట్ లా ఉంది టీజర్.
2021 డిసెంబర్ లో విడుదలై సంచలనం సృష్టించిన 'పుష్ప-1' కి కొనసాగింపుగా వస్తోంది ఈ చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిసున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |