![]() |
![]() |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్'కి టాలీవుడ్ టాప్ స్టార్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల 'టిల్లు స్క్వేర్' సినిమాని చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది.
'టిల్లు స్క్వేర్' టీంని ప్రశంసిస్తూ తాజాగా రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. "డియర్ సిద్ధూ, నువ్వు అద్భుతమైన విజయం సాధించడం పట్ల చాలా గర్వంగా ఉంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు మల్లిక్ రామ్, సంగీత దర్శకులు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు." అని రాసుకొచ్చాడు.

'టిల్లు స్క్వేర్' చిత్రం 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందింది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టిల్లు స్క్వేర్'.. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.101.4 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ సాధించింది. కాగా ఈ మూవీ సక్సెస్ మీట్ రేపు(ఏప్రిల్ 8) జరగనుంది. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.
![]() |
![]() |