![]() |
![]() |

సినిమా రంగం కూడా ఒక పరిశ్రమ లాంటిదే. అందులో మొత్తం 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి చాలా సంఘాలు ఉన్నాయి. వాటిల్లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి. షార్ట్ కట్ లో చెప్పాలంటే మా అసోసియేషన్. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి చాలా ప్రెస్టేజియస్ట్ ది కూడా. బడా నటుల దగ్గర్నుంచి చోటా నటుల దాకా అందులో సభ్యులుగా ఉన్నారు. తాజాగా మా కి సంబంధించిన ఒక విషయం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
మా ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరుగుతుంటాయి. సభ్యులందరు ఓటు హక్కు ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. గత ఎన్నికలు 2021 లో జరిగాయి. అధ్యక్షుడుగా ప్రముఖ నటుడు మంచు విష్ణు గెలుపొందారు.అలాగే తన ప్యానల్ లోని చాలా మంది సభ్యులు విజయం సాధించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఎందుకంటే మంచు విష్ణుకి పోటీగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చెయ్యడంతో సాధారణ ప్రజలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తిని చూపించారు. ఇక ఇప్పుడు మంచి విష్ణు పదవీకాలం ముగియనుంది. 2024 కి సంబంధించి ఎన్నికలు జరగాలి. కానీ ఈ సారి జరగడం లేదు. సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా మంచు విష్ణు నే మళ్ళీ ఎన్నుకున్నారు.
దీంతో వరుసగా రెండో సారి మా అధ్యక్షుడుగా చేస్తున్న రికార్డు ని విష్ణు సాధించాడు.గత ఎన్నికల్లో హామీగా ఇచ్చిన మా బిల్డింగ్ ని ఈ సంవత్సరం కట్టాలనే రెండో సారి కూడా విష్ణుని ఎన్నుకున్నారు. ఫండింగ్ కోసం జులై లో మలేషియాలో ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నామని వైస్ ప్రెసిడెంట్ మాదాల రంగారావు తెలిపాడు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం భక్త కన్నప్ప చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఆ చిత్రం తెరకెక్కుతుంది.
![]() |
![]() |