![]() |
![]() |
.webp)
కొన్ని కాంబినేషన్ల పేరు వింటే సినీ అభిమానులకి పూనకాలు రావాల్సిందే. పైగా ఆ కాంబో సెట్ అవ్వాలని తమ ఇష్ట దైవాలని కూడా ప్రార్థిస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తాజాగా సోషల్ మీడియాలో జక్కన్న,మహేష్ మూవీల గురించి ఒక న్యూస్ వినిపిస్తుంది.ఇలాంటి న్యూస్ గతంలో చాలానే వచ్చాయి. కానీ ఇది మాత్రం వెరీ స్పెషల్. మరి ఆ వార్త ఏంటో చూద్దాం.
బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో అమీర్ ఖాన్ కూడా ఒకడు.ముప్పై సంవత్సరాల తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసాడు.చాలా చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఇప్పుడు మహేష్ జక్కన్న మూవీలో అమీర్ ఖాన్ చేయబోతున్నాడనే వార్త ఇండియన్ సినీ సర్కిల్స్ లో చాలా జోరుగా వినపడుతుంది. త్వరలోనే జక్కన్న టీం అమీర్ ని కలవబోతుందని కూడా అంటున్నారు. అమీర్ కనుక మహేష్ మూవీలో నటించడం జరిగితే సినీ ప్రేమికులకి పండగే అని చెప్పవచ్చు.అలాగే ఆ ఇద్దరి కాంబో పలు సంచలనాలని కూడా నమోదు చెయ్యవచ్చు.
.webp)
ఇక మహేష్ జక్కన్న ల మూవీ గురించి ఏదో ఒక న్యూస్ చెప్పకపోతే సోషల్ మీడియాకి పొద్దు పొడవని పరిస్థితి. గతంలో హాలీవుడ్ హీరోయిన్ చెయ్యబోతుందనే వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా జక్కన్న చెప్తేనే అన్ని తెలుస్తాయి. ఇక ఉగాదికి ఏమైనా అప్ డేట్ ఉంటుందేమోనని అనుకుంటున్నారు. అలాంటి వాతావరణం అయితే ప్రస్తుతం లేదు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సాధించిన రాజమౌళి మహేష్ మూవీతో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందన్న సమాచారం అయితే ఉంది.
![]() |
![]() |