![]() |
![]() |

సినీ రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా.. విభిన్న సినిమాలు, పాత్రలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'కృష్ణమ్మ'. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ.. ''రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. టైటిల్ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ''స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది'' అని చెప్పారు.
ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. సినిమాటోగ్రాఫర్ గా సన్నీ కూరపాటి, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |