![]() |
![]() |

ఇప్పుడు హీరోయిన్ లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు తాప్సీ పొన్ను. దశాబ్ధం కిందటే ఝుమ్మంది నాదం తో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఆ తర్వాత అన్ని బాషల్లోను నటించి తన సత్తా చాటింది. గత డిసెంబర్ లో కింగ్ ఖాన్ షారుక్ తో కూడా జతకట్టి తను ఎంత పెద్ద క్వాలిటీ నటీమణి అనే విషయాన్నీ అందరకి తెలియచేసింది.ఆమె గురించి వస్తున్న తాజా న్యూస్ ఇప్పుడు హీట్ ని రాజేస్తోంది
ఢిల్లీ కి చెందిన తాప్సీ తన పర్సనల్ విషయాలని మీడియాతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడదు. కానీ సంవత్సరం కిందట తనంతట తానే నేను మథియాస్ తో డేటింగ్ లో ఉన్నాననే విషయం చెప్పింది. దీంతో అందరు ఒక్క సారిగా షాక్ అయ్యి మథియాస్ గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.తాజాగా తాప్సీ మథియాస్ లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఉదయపూర్ లో అత్యంత వేడుకగా జరిగిన ఈ పెళ్ళిలో ఇరువైపులా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరిగాయి. ఇప్పుడు పెళ్లి విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా అందర్నీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటుంది. కానీ అందుకు విరుద్ధంగా చేసుకోవడంతో ఎంతైనా తాప్సీ స్పెషల్ అని అనుకుంటున్నారు. రెండు రోజులు పాటు సోషల్ మీడియాలో ఆమె ఇన్ యాక్టీవ్ గా ఉండటంతో పెళ్లి విషయం బయటపడింది.

2013 లో లక్నో లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ పోటీల్లో తాప్సీ మథియాస్ లు కలుసుకున్నారు. ఆ సమయంలో లక్నో టీం కి మథియాస్ భాగం కాగా తాప్సీ హైదరాబాద్ టీం కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. పైగా తనతో చాలా మందితో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఎవరు తనకి పెద్దగా కనెక్ట్ అవ్వలేదని మథియాస్ మాత్రమే నచ్చాడని గతంలో చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని బడా మూవీస్ ఉన్నాయి.
![]() |
![]() |