![]() |
![]() |

కమర్షియల్ అండ్ యాక్షన్ చిత్రాల హీరో గోపీచంద్ ( gopichand) ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అభిమాన గణం కూడా ఎక్కువే. రీసెంట్ గా భీమా(bhimaa)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన ఎంటైర్ సినీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన మూవీగా అది నిలిచింది.ఇప్పుడు భీమా కి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ ప్రేమికుల్లో ఆనందాన్ని నింపుతుంది.
వచ్చేనెల ఏప్రిల్ 5 న భీమా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పుడు ఈ వార్తతో పాన్ ఇండియా సినిమా ప్రేమికులు ఫుల్ హ్యాపీ తో ఉన్నారు. గోపీచంద్ తన కెరీర్లో తొలిసారి డ్యూయల్ రోల్ లో నటించాడు. పోషించిన రెండు క్యారెక్టర్స్ లోను వేరియేషన్ ని చూపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాడు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా గోపీచంద్ కి జోడిగా మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ లు చేసారు. వీళ్లిద్దరి పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి పేరు వచ్చింది.
నాజర్, రఘుబాబు, వెన్నెల కిషోర్ ,కాశీ విశ్వనాద్ లాంటి మేటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ దర్శకుడు హర్ష( harsha) దర్శకత్వం వహించగా సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మించాడు. ఈయన గతంలో చాలా సినిమాలని నిర్మించాడు. పాన్ ఇండియా లెవల్లో శివరాత్రి కానుకగా మార్చి 8 న థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. కేజిఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతాన్ని అందించాడు. ఆర్ ఆర్ కి అయితే థియేటర్స్ దద్ధరిల్లాయి.
![]() |
![]() |