![]() |
![]() |
థియేటర్లలో, ఓటీటీల్లో ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాయి. సినిమా ప్రేమికులు ప్రతివారం విడుదలయ్యే సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో ఆడియన్స్‌ని అలరించే సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాల్లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సిద్ధంగా ఉంది. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. అలాగే మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా రూపొందిన ‘ఆడు జీవితం’ చిత్రాన్ని ‘ది గోట్ లైఫ్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు కొన్ని సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇక వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్‌ని ఒకసారి పరిశీలిద్దాం.
ప్రేమలు (డిస్నీ ప్లస్ హాట్ స్టార్) : మలయాళంలో రూపొందిన ‘ప్రేమలు’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలైంది. కేరళలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్చి 8న విడుదలైంది. తెలుగులో కూడా సూపర్‌హిట్ అయి అందరి ప్రశంసలు అందుకుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇన్‌స్పెక్టర్ రిషి (ప్రైమ్ వీడియో) : నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తమిళ్‌లో రూపొందిన వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. క్రైమ్, హారర్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. లహిరి దర్శకత్వం వహించారు. మార్చి 29 నుంచి తెలుగు, తమిళ భాషలతోపాటు మరో మూడు లాంగ్వేజెస్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
లవర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) :
తమిళంలో రూపొందిన ‘లవర్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మార్చి 27న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
లుటేరే (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) :
‘లుటేరే’ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మార్చి 28న మరొక ఎపిసోడ్‌ను రిలీజ్ చేయనున్నారు. మిగిలిన ఎపిసోడ్స్‌ని కూడా వెంట వెంటనే అందిస్తారట.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (నెట్‌ఫ్లిక్స్)
హిందీలో ఎంతో పాపులర్ అయిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్స్ ప్రసారం అవుతూ ఉంటాయి. మార్చి 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ స్ట్రీమింగ్ కాబోతోంది.
పట్నా శుక్లా (డిస్నీ పస్ల్ హాట్‌స్టార్) :
‘పట్నా శుక్లా’ అనే సినిమాను ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించారు. బీహార్‌లో జరిగిన ఒక ఎడ్యుకేషనల్ స్కామ్ గురించి వివరిస్తూ ఆ కేసును డీల్ చేసే ఓ లాయర్ కథ ఇది. ఈ సినిమాలో రవీనా టండన్ నటించారు. ఈ మూవీ మార్చి 29నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవిగాక మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి.
అమెజాన్ ప్రైమ్ : టిగ్ నొటారో (వెబ్‌సిరిస్)మార్చి 26, ది బాక్స్‌టర్స్ (వెబ్‌సిరీస్) మార్చి 28
నెట్‌ఫ్లిక్స్ : టెస్టామెంట్ (వెబ్‌సిరీస్) మార్చి 27, హార్ట్ ఆఫ్ ది హంటర్ మార్చి 29, ది బ్యూటిఫుల్ గేమ్ మార్చి 29,
![]() |
![]() |