![]() |
![]() |
.webp)
గంగోత్రి నుంచి పుష్ప వరకు ఐకాన్ స్టార్ బన్నీ ఉరఫ్ అల్లు అర్జున్ సినీ ప్రయాణం అందరకి తెలిసిందే. తన నటనతో డాన్సులతో కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. నేడు బన్నీ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లి పోవాల్సిందే. తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.
బన్నీ వైఫ్ పేరు స్నేహా. వారిద్దరి వివాహం 2011 మార్చి 6 న జరిగింది. అంటే నేటికీ 13 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఈ సందర్భంగా స్నేహాకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతు బన్నీ చెప్పిన మాటలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. నీ వల్లే ఈ ప్రయాణం సంతోషంగా కొనసాగుతుంది.నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటు నాకు శక్తిని ఇస్తున్నావు. చివరి వరకు మన ప్రేమ ఇలాగే కొనసాగాలి. హ్యాపీ యూనివర్సిరీ క్యూటీ అంటు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.ఇప్పుడు ఈ పోస్ట్ ట్రెండింగ్ లో ఉంది.పలువురు వెల్ విషర్స్ , ఫ్యాన్స్ ఆ ఇద్దరకీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
.webp)
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే స్నేహా బన్నీ ట్వీట్ కి ఎలా రిప్లై ఇస్తుందో అని అందరు
ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అదే టైం లో స్నేహాకి బన్నీ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. ప్రస్తుతం బన్నీ తన న్యూ మూవీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అగస్ట్ 15 న ఆ మూవీ రిలీజ్ కాబోతుంది. పుష్ప కాంబో రిపీట్ అవుతుండటంతో అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |