![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సూపర్ హిట్ మూవీ 'నాయక్' రీ రిలీజ్ కానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటించారు. 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 11 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో అలరించడానికి సిద్ధమైంది.
'నాయక్' సినిమాను ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని, కాస్త ముందుగా మార్చి 23న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

థియేటర్లో ఎంజాయ్ చేసేలా పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా 'నాయక్' ఉంటుంది. ఇందులో కామెడీ, ఫైట్లు, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా జిలేబిగా బ్రహ్మానందం పంచిన వినోదాన్ని అంత తేలికగా మర్చిపోలేము.
తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాహుల్ దేవ్, దేవ్ గిల్, జయప్రకాశ్ రెడ్డి, ఎం.ఎస్. నారాయణ, రఘుబాబు, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు, ఎడిటర్ గా గౌతంరాజు వ్యవహరించారు.
![]() |
![]() |