![]() |
![]() |

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ ఒకడు. గత 15 ఏళ్లుగా ఏడాదికి కనీసం ఒక్క సినిమాని అయినా విడుదల చేస్తూ వస్తున్న శర్వానంద్.. గతేడాది మాత్రం ప్రేక్షకులను పలకరించలేదు. 2022 లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో నిరాశపరిచినప్పటికీ, 'ఒకే ఒక జీవితం'తో ఆకట్టుకున్న శర్వా.. 2023లో మాత్రం ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. ఆ గ్యాప్ ని భర్తీ చేసేలా ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు శర్వానంద్.
నేడు(మార్చి 6) శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాల అప్డేట్లు వచ్చాయి. శర్వానంద్ తన 35వ సినిమాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'మనమే' అనే టైటిల్ పెట్టారు. శర్వా బర్త్ డే కానుకగా తాజాగా విడుదలైన కలర్ ఫుల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.
'మనమే'తో పాటు శర్వానంద్ నటిస్తున్న మరో రెండు సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. శర్వా తన 36వ సినిమాని 'లూజర్' ఫేమ్ అభిలాష్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శర్వా బైక్ రేసర్ గా కనిపించనున్నాడు.
ఇక శర్వా తన 37వ సినిమాని 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందనుంది.
![]() |
![]() |