![]() |
![]() |

ఇటీవల ట్రైలర్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సినిమా అంటే 'గామి' అని చెప్పవచ్చు. విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ అడ్వెంచర్ ఫిల్మ్ ట్రైలర్ కట్టిపడేసింది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటమే కాకుండా.. విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే పేరు తెచ్చుకుంది. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసి అనుభూతి చెందటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
తాజాగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా 'గామి' సినిమా గురించి మాట్లాడారు. "అద్భుతమైన విజువల్స్ తో 'గామి' చిత్రాన్ని రూపొందించడం కోసం నాలుగేళ్ల పాటు వారు ఎంత కష్టపడ్డారో నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ చెప్పినప్పుడు.. 'కఠోరమైన శ్రమ చేస్తే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి' అనే మాట గుర్తుకొచ్చింది." అంటూ 'గామి' టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు రాజమౌళి.

![]() |
![]() |