![]() |
![]() |
.webp)
తెలుగులో ఓ సినిమా వస్తుందంటే రెండు రాష్ట్రాలలో సినిమా లవర్స్ లో హుషారు మొదలవుతుంది. అందులోను ప్రస్తుతం ఓటీటీల హవా సాగుతుంది. ఇక ఓటీటీలోకి వచ్చే సినిమాల కోసం తెగ నిరీక్షిస్తుంటారు కొందరు. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోయే తెలుగు సినిమా గురించి తెలుసుకుందాం.
బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమా " సౌండ్ పార్టీ ". నవంవర్ లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. వీజే సన్నీ, హృతిక శ్రీనివాస్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ " సౌండ్ పార్టీ ". ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా.. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. నవంబర్ నెలలో థియేటర్ లో రిలీజైన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ వేదిక ఆహాలో మార్చి 8 న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.
డాలర్ కుమార్( వీజే సన్నీ) అతడి తండ్రి కుబేర్ కుమార్(శివన్నారణ) లది మధ్యతరగతి కుటుంబం. కుబేర్ కుమార్ ఏ వ్యాపారం చేసిన అందులో నష్టమే తప్ప లాభం ఉండదు. అయితే కొడుకు డాలర్ కుమార్ మాత్రం కోటీశ్వరులం అవ్వాలనే కలలు కంటాడు. అదే సమయంలో డాలర్ కుమార్ వాళ్ళ నాన్న కుబేర్ కుమార్ తనకి తెలిసిన స్నేహితుడి దగ్గర అప్పు చేసి ఓ హోటల్ ని ప్రారంభిస్తాడు. అది కొన్ని రోజులు బాగానే సాగిన తర్వాత తీవ్రమైన నష్టం వాటిల్లి అది క్లోజ్ చేసే పరిస్థితి ఎదురవుతుంది. ఇక తీసుకున్న అప్పుని చెల్లించమని ఒత్తిడి పెరిగిపోతుంది. ఇదే సమయంలో వీరిద్దరికి ఓ మర్డర్ కేసు మీద వేసుకొని జైలుకెళ్తే రెండు కోట్లు ఇస్తామనే ఆఫర్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ నేరమేంటి? తండ్రికొడుకులు అప్పుల బాధ నుండి బయటపడ్టారా లేదా అనేది మిగతా కథ. మరి ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయ్యండి.
![]() |
![]() |