![]() |
![]() |
.webp)
విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న నయా మూవీ గామి. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 8 న విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ పబ్లిసిటీ లో వేగాన్ని పెంచారు. ఒక వినూత్న రీతిలో చేస్తున్న ఆ పబ్లిసిటీ ఇప్పడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయ్యింది. పైగా గామిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీ ని కూడా కలుగచేస్తుంది.
గామి రిలీజ్ కి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు అన్ని చోట్ల దర్శనం ఇస్తున్నాయి. మంచు కొండల మీద ఇంకో నాలుగు రోజుల్లో గామి రిలీజ్ అని వేసిన కౌంట్ డౌన్ పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో హనుమాన్ మూవీ కూడా రిలీజ్ టైం లో ఇలాగే కౌంట్ డౌన్ పోస్టర్లు ని వేసింది. అవి ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యి సినిమా విజయానికి దోహదపడ్డాయి. ఇప్పుడు గామి విషయంలో కూడా అది రిపీట్ అవుతుందేమో చూడాలి.

అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న గామి కి విద్యాధర్ దర్శకుడిగా వ్యవహరించాడు. చాందిని చౌదరి, అభినయ లు హీరోయిన్ లుగా చేస్తున్నారు. విశ్వక్ సేన్ సినీ కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకులంతా గామి కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో అయితే సినీ ప్రియులంతా గామి గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒక సరికొత్త ప్రపంచాన్ని గామి పరిచయం చెయ్యబోతుందనే విషయం కూడా అందరకి అర్ధం అయ్యింది.గామికి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించగా విశ్వనాధ్ రెడ్డి ఫోటోగ్రఫీని అందించాడు.
![]() |
![]() |