![]() |
![]() |
.webp)
ఒకప్పుడు నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అని అనిపించుకున్న ఇంద్రజ చాలా కాలం తర్వాత మూవీస్ లోకి వస్తూ అలరిస్తోంది. తెలుగు బుల్లితెర మీద జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. అలాంటి ఇంద్రజ ఇప్పుడు "రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" మూవీలో చాకలి ఐలమ్మ గెటప్ లో స్ట్రాంగ్ రోల్ లో పెర్ఫార్మ్ చేయబోతోంది. యాట సత్యనారాయణ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. ఇంద్రజ ఐలమ్మ రోల్ లో నటించిన ఒక పిక్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. మహిళా దినోత్సవం రాబోతున్న ఈ టైంలో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, పోరాట సమయంలో వారు ప్రదర్శించిన ధైర్యం వంటి ఎలిమెంట్స్ ని ఈ మూవీలో చూపించనున్నారు మేకర్స్. 1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలతో ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీ మార్చి 15న తెలుగు, హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక, అన్నుశ్రియ త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక తన పిక్ కి "మేము వంట, ఇంటి పనులే కాదు మా హక్కుల కోసం కూడా గొంతెత్తుతాం" అంటూ కాప్షన్ పెట్టుకుంది ఇంద్రజ. ఇక నెటిజన్స్ ఐతే కరెక్ట్ రోల్, గొప్ప పాత్ర చేస్తున్నారు..కొన్ని తరాలు చెప్పుకునేలా మీ పాత్ర ఉండాలి అని కోరుకుంటున్నాను..మీరు పెద్ద పులి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే ఇంద్రజ తమిళ్ లో కూడా రిఎంట్రీ ఇవ్వబోతున్నారు. "మిలో" అనే మూవీ షూటింగ్ కోసం వెళ్తూ కొన్ని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన డిటైల్స్ త్వరలో చెప్తాను మీ బ్లేసింగ్స్ ఇవ్వండి అని అడిగింది. తమిళనాడులోని నామకల్ లో షూటింగ్ కోసం వెళ్తున్నామంటూ చెప్పింది ఇంద్రజ.
![]() |
![]() |