![]() |
![]() |

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇందులో శ్రీవిష్ణు హీరోగా నటించనున్నాడు. శ్రీవిష్ణు పుట్టినరోజు(ఫిబ్రవరి 29) సందర్భంగా ఈరోజు ఈ ప్రకటన రావడం విశేషం.
గతేడాది 'సామజవరగమన'తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీవిష్ణు వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. మార్చి 22న 'ఓం భీమ్ బుష్' అనే కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో 'SWAG'(శ్వాగణిక వంశానికి స్వాగతం) అనే సినిమా చేస్తున్నాడు. ఇక తన 18వ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్నాడు.

శ్రీవిష్ణు 18వ సినిమా ప్రకటన తాజాగా వచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో క్యూట్ గా ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి శ్రీవిష్ణుకి ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది. అందులో ఉన్న ఫజిల్ ని విష్ణు సాల్వ్ చేయగా.. అనౌన్స్ మెంట్ పోస్టర్ రివీల్ అవుతుంది.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కాళ్య ఫిలిమ్స్ బ్యానర్స్ పై రూపొందనున్న ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ కి కార్తీక్ రాజు దర్శకుడు. కార్తీక్ గతంలో 'నిను వీడని నీడను నేనే', 'నేనే నా' వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |