![]() |
![]() |
.webp)
మొన్న సంక్రాంతికి గుంటూరు కారంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే హిట్ కొట్టాడు. మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా ఇక్కడుంది రమణ గాడు అంటూ రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. తాజాగా ఆ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి మహేష్ ఫ్యాన్స్ లో నయా జోష్ ని తీసుకొచ్చింది.
గుంటూరు కారం కి థమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన అందించిన సాంగ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరు సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేసారు. ఇక థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులకి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతగానో అలరించింది.మరీ ముఖ్యంగా రమణ గాడి క్యారక్టర్ కి అయితే థమన్ ఇచ్చిన బిజిఎం ని మాటల్లో చెప్పలేం. మహేష్ ఫ్యాన్స్ చేత, ప్రేక్షకుల చేత ఈలలు కూడా వేయించింది. అలాగే ఎమోషనల్ ట్రాక్స్ కి సంబంధించిన బిజిఎం కూడా చాలా మంది మనసుల్ని తాకింది
దీంతో ఓఎస్టీ కోసం అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా దీనిపై థమన్ అదిరిపోయే క్లారిటీ ని అందించాడు. ఓఎస్టీ ని మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా చెప్పాడు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవు. ఎప్పుడెప్పుడు మార్చ్ 10 వస్తుందా అని ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు.గుంటూరు కారాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.
![]() |
![]() |