![]() |
![]() |

సినిమా రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంతో మంది భామలు వస్తు ఉంటారు. కొన్నిసినిమాల్లో నటించి మంచి గుర్తింపుని కూడా తెచ్చుకుంటారు. కానీ ఆ తర్వాత సరైన క్యారక్టర్ లు రాకపోవడంతో మాయం అయిపోతుంటారు.ఈ కోవలోనే ఒక సూపర్ హిట్ సినిమాలోని భామ వస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుండటంతో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీ తెలియని తెలుగువారు లేరు. రికార్డులని సృష్టించిన ఆ మూవీలో మాఫియా డాన్ అలీభాయ్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. భాయ్ కి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న అమ్మాయిగా నటించి అందరి మన్నలని అందుకుంది.ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ గిల్లగానే నొప్పి వేయడంతో అరుస్తుంది. దాంతో గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అని ప్రకాష్ రాజ్ అంటాడు.

ఆ సీన్లో నటించిన ముద్దుగుమ్మ పేరు శివ రాణా. ఇప్పుడు సినిమాలు మానేసి యోగా టీచర్ గా వర్క్ చేస్తుంది. ఇనిస్టాగ్రమ్ లో యాక్టీవ్ గా ఉండే శివ రాణా అందుకు సంబంధించిన పిక్స్ ని షేర్ చేస్తు అభిమానులని అలరిస్తు ఉంది పోకిరి తర్వాత దగడ్, దేవుడు చేసిన మనుషులు, మెహబూబ్ చిత్రాల్లో నటించింది. కానీ సరైన గుర్తింపు రాలేదు. దీంతో యోగా టీచర్ గా వర్క్ చేస్తుంది.
![]() |
![]() |