![]() |
![]() |

సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్ 'ఊరు పేరు భైరవకోన'. మంచి అంచనాలతో ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టింది. ముఖ్యంగా కొన్ని హారర్ కామెడీ సన్నివేశాలు, విజువల్స్ ప్రేక్షకులను మెప్పించాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'ఊరు పేరు భైరవకోన' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అదే బాటలో 'ఊరు పేరు భైరవకోన' కూడా పయనించనుందని సమాచారం. ఈ సినిమా మార్చి 15 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుందని వినికిడి.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, పి. రవిశంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.
![]() |
![]() |