![]() |
![]() |

సరిగ్గా తెరకెక్కించాలే గాని లేలేత ప్రేమ కథలకి సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు విజయం లభిస్తుంది.అలాగే కాసుల వర్షం కూడా కురుస్తుంది.ఈ విషయాన్ని మరోసారి ఒక నయా టీనేజ్ లవ్ మూవీ చాటి చెప్పింది. ఎలాంటి స్టార్స్ లేరు, స్టార్స్ టెక్నీషియన్స్ లేరు కానీ సరికొత్త రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.
మొన్న ఫిబ్రవరి 9 న కేరళతో పాటు అనేక ఏరియాల్లో మలయాళ భాషలో మాత్రమే విడుదలైన మూవీ ప్రేమలు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి ఇప్పుడు విడుదలైన అన్ని చోట్ల హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. 12 కోట్ల బడ్జట్ తో నిర్మాణం జరుపుకుని ఇప్పటికే 50 కోట్లు దాకా రాబట్టింది. రిలీజ్ అయిన 10 రోజులకే ఆ స్థాయి కలెక్షన్స్ తో టాక్ ఆఫ్ మాలీవుడ్ గా కూడా నిలిచింది. ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతుంది.
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రేమలు హైదరాబాద్ నేపథ్యంలోనే రూపొందింది. నాజల్, మమిత బైజు, అల్తాఫ్ సలీం, అఖిల భార్గవన్ , మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించగా గిరీష్ రచనా దర్శకత్వం వహించాడు.పుష్ప పార్టీ లేదని తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపిన ఫాహాద్ ఫాజిల్ ఇంకో ఇద్దరితో కలిసి ప్రేమలు ని నిర్మించాడు. తెలుగులో కూడా ప్రేమలు డబ్ అవ్వబోతుంది.
![]() |
![]() |