![]() |
![]() |

ఇప్పడు ఒక సినిమాలో నటీనటులు ఎవరన్నది ముఖ్యం కాదు, ఏ బాషా చిత్రం అన్నది ముఖ్యం కాదు. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ కారణంతోనే ఇప్పుడు పాన్ ఇండియా కథలతో చాలా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఈ కోవలోనే మరో మూవీ శరవేగంగా ముస్తాబవుతోంది.
కన్నడ సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన డార్లింగ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ హలగలి. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ 1857వ సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటనల స్పూర్తితో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతుంది. కొన్ని పిరియాడిక్ సన్నివేశాలని అక్కడ చిత్రీకరిస్తున్నారు. తెలుగులోను రిలీజ్ అవుతున్న ఆ మూవీ మీద అందరిలోను మంచి అంచనాలే ఉన్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హలగలి ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

దుహర మూవీస్ బ్యానర్ పై కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మాతగా, సుఖేష్ డీకే దర్శకత్వంలో సుమారు 100 కోట్ల బడ్జట్ తో రూపుదిద్దుకుంటుంది.త్వరలోనే మిగతా ఆర్టిస్ట్ ల వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. పీరియాడిక్, యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా హలగలి నిర్మాణాన్ని జరుపుకుంటుంది.
![]() |
![]() |