![]() |
![]() |

లేటెస్ట్ గా వచ్చిన ఊరు పేరు భైరవ కోన హిట్ టాక్ తో విడుదలయిన అన్ని చోట్ల మంది కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆ చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ అని అందరు ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో తన కొత్త మూవీని స్టార్ట్ చెయ్యబోతున్నాడు.
విఐ ఆనంద్ తన నెక్స్ట్ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో చేస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడి చేసింది. ఆనంద్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పోస్టర్ ద్వారా ఆయనకి బర్త్ డే విషెస్ చెప్తు ఆ విషయాన్నీ చెప్పింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఊరి పేరు భైరవ కోన కి ఏకే సంస్థ ఒన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేసింది.

ఇక ఏకే నుంచి గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ వచ్చి పరాజయం పాలయ్యింది. దీంతో ఈ కాంబో సినీ సర్కిల్స్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. ఏకే బ్యానర్ లో 27వ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటుంది.మూవీకి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఊరు పేరు భైరవకోన తో పాటు టైగర్ ,ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి చిత్రాలు వచ్చాయి.
![]() |
![]() |