![]() |
![]() |
.webp)
విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
బలమైన కంటెంట్, అద్భుతమైన విజువల్స్ తో 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒంటి మీద గాయాల గుర్తులతో ఎయిర్ వారియర్ రుద్రగా వరుణ్ తేజ్ పాత్ర పరిచయమైంది. బాంబ్ ఎటాక్ తో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్ లపై ప్రతీకారం తీర్చుకోవాలని రుద్ర రగిలిపోతుండటం ట్రైలర్ లో చూడొచ్చు. "ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు. ఆకాశం రంగు మార్చడానికి మీరందరూ సిద్ధమేనా?" అంటూ 'ఆపరేషన్ వాలెంటైన్' పేరుతో ఎయిర్ వారియర్స్ మిషన్ స్టార్ట్ చేయడం మెప్పించింది. శత్రు దేశం పాకిస్థాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, ఈ క్రమంలో రుద్ర ఫైటర్ జెట్ కూడా కూలిపోవడం వంటి సన్నివేశాలతో.. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి.
మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోలో హీరోగా 'గని', 'గాండీవధారి అర్జున' వంటి సినిమాలతో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న వరుణ్ తేజ్.. 'ఆపరేషన్ వాలెంటైన్'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
![]() |
![]() |