![]() |
![]() |

లేటెస్ట్ గా హనుమాన్ తో హిట్ కొట్టి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందిన నటుడు తేజ సజ్జ. ఆ మూవీతో అతి తక్కువ సినిమాలతోనే మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రికార్డు సృష్టించిన తేజ తాజాగా షేర్ చేసిన ఒక పిక్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.
తేజ తన ఇనిస్టాగ్రమ్ లో ప్రముఖ హీరో నితిన్ తో కలిసి దిగిన పిక్ ని షేర్ చేసాడు. అందులో నితిన్ తేజ సజ్జ ని ఆప్యాయంగా కౌగిలించున్నాడు. పైగా హనుమాన్ తో శ్రీ ఆంజనేయం అనే ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ని కూడా తేజ చేసాడు ఇప్పడు ఆ పిక్ చూసిన వాళ్ళందరు నితిన్ గత మూవీ శ్రీ ఆంజనేయం ని గుర్తుచేసుకుంటున్నారు.ఎందుకంటే హనుమాన్ లాగానే ఆ మూవీ కూడా పూర్తిగా ఆంజనేయ స్వామి మీదనే తెరకెక్కింది. అంజి అనే ఒక పిరికివాడి క్యారెక్టర్ లో నితిన్ నటించాడు.ఆ తర్వాత అంజిలోకి ఆంజనేయుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో వచ్చిన సీన్స్ అన్ని ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సో ఇప్పుడు తేజ సజ్జ వల్ల మరోసారి అందరు శ్రీ ఆంజనేయం ని గుర్తుచేసుకుంటున్నారు. పైగా ఇక్కడ ఇంకో యాదృచ్చికరమైన విషయం ఏంటంటే నితిన్ కూడా తన కెరీర్ మొదట్లోనే ఆంజనేయుడి మీద శ్రీ ఆంజనేయం సినిమా చేసాడు. ఇప్పుడు తేజ కూడా సేమ్ తన కెరీర్ మొదట్లోనే హనుమాన్ చేసాడు.
![]() |
![]() |