![]() |
![]() |

తెలుగు సినిమాకి ఒక సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో బోయపాటి కూడా ఒకడు. ఆయన హీరో కళ్ళకి అన్యాయం కనిపించడం ఆలస్యం ఇంక ఆ అన్యాయం గాని దాని తాలూకు మనిషి గాని నామరూపాలు లేకుండా పోతాడు.ఆయన తన మొదటి సినిమా నుంచి ఇదే విషయాన్ని చాలా బలంగా చెప్తాడు. తాజాగా ఆయన సినిమాలో హీరో ఎందుకు అంత డేర్ గా ఉంటాడో అనే విషయం తెలుగు ప్రజలకి క్లియర్ గా అర్ధం అయ్యింది.
బోయపాటి లేటెస్ట్ గా గుంటూరు లోని ఆర్ వి ఆర్ అండ్ జె సి ఇంజనీరింగ్ కాలేజీ కి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న టెక్నీకల్ అండ్ కల్చరల్ స్పోర్ట్స్ టెస్ట్స్ పోటీలకి ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యాడు.ఈ సందర్భంగా విద్యార్థులని ఉద్దేశించి ఆయన కీలకమైన ప్రసంగాన్ని చేసాడు. రేపు జరగబోయే ఎలెక్షన్స్ లో మీరంతా పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వెయ్యాలి. అలాగే మీ ఓటుని కేవలం ఓటు కోసం చూసే నాయకుడికి కాకుండా మీ భవిష్యత్తు కోసం పని చేసే నాయకుడుకి వెయ్యండని చెప్పాడు. మీరు అలా ఓటు వేసినప్పుడే మనందరి భవిష్యత్తు కోసం పని చేసే నాయకుడు వస్తాడని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు బోయపాటి చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
అలాగే ఇంజనీర్లుగా ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా జన్మనిచ్చిన తల్లి తండ్రులని మాత్రం వదలకండని చెప్పిన ఆయన తాను కూడా ఆర్ వి ఆర్ అండ్ జె సి లోనే చదివానని చెప్పాడు.బోయపాటి తన సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు 10 సినిమాల దాకా చేసాడు. తన ప్రతి సినిమాలో కూడా మంచి సోషల్ మెసేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ లో సినిమా చెయ్యబోతున్నాడు.ఈ విషయం ఇటీవలే అధికారకంగా కూడా వెల్లడయ్యింది. హీరో ఎవరనే విషయం మీద కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
![]() |
![]() |