![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమకి విజయాలు తక్కువగా ఉన్న సమయంలో వరుస హిట్ లతో తను ముందుకు దూసుకుపోవడమే కాకుండా చిత్ర పరిశ్రమకి కూడా హిట్ లు ఇస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస హ్యాట్రిక్ హిట్ లతో మంచి జోరు మీద మీద ఉన్నాడు. తాజాగా బాలయ్య గురించి వస్తున్న ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్నాడు. తన రేంజ్ కి తగట్టుగా ఒక పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య మెరవనున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏకధాటిగా జరుగుతూ ఉంది.అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ షూటింగ్ కి బ్రేక్ తీసుకుబోతున్నాడనే వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. తెలుగుదేశం తరుపున రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చెయ్యడం కోసమే ఆయన షూటింగ్స్ కి గ్యాప్ తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. పైగా హిందూపురం నుంచి మరోసారి ఎంఎల్ఏ గా బరిలోకి దిగుతున్నాడు. సో ఎలక్షన్స్ అయిపోయే దాకా బాలకృష్ణ బిజీగా ఉంటాడు కాబట్టి సినిమా చెయ్యడం కొంచం కష్టమే అవుతుంది.
మొదటి నుంచి కూడా కళ విషయంలో బాలకృష్ణ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. సినిమా బాగా రావాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.అలాగే ఆ నిర్ణయానికి దర్శకుడు బాబీతో పాటు నిర్మాతలు కూడా మద్దతుగా నిలిచారనే వార్తలు వస్తున్నాయి. సో బాలయ్య నట విశ్వరూపాన్ని మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మాత్రమే స్క్రీన్ మీద చూస్తాం.
![]() |
![]() |