![]() |
![]() |
.webp)
ఆర్జీవీ ఏది చేసినా అందులో వెరైటీ ఉంటుంది..ఏం మాట్లాడినా అందులో బోలెడు అర్థాలుంటాయి..ఏ పిక్ ని పోస్ట్ చేసినా అందులో అంతరార్థం వేరుగా ఉంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా ఒక ముక్కలోనో, ఒక వాక్యంలోనో, ఒక సెకన్ వీడియోతోనో చెప్పేసి జనాల్లోకి వదిలేస్తాడు. ఇక వెతుక్కున్నవాళ్ళకి వెతుక్కున్నన్ని బూతులు అందులో కనిపిస్తాయి. ఇక ఆర్జీవీ అటు మూవీస్ మీద ఎంత గ్రిప్ ఉందో ఇటు పాలిటిక్స్ మీద, పొలిటీషియన్స్ మీద కూడా అంతే గ్రిప్ ఉంది. ఇలాంటి టైంలో రాజకీయ నాయకులను కుక్కలతో పోల్చాడు ఆర్జీవి.
అసలే ఏపీ పాలిటిక్స్ మంచి హీట్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఓవర్ నైట్ లో పార్టీ నేతలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంపింగులు చేస్తూ ప్రజలను కంఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆర్జీవీ తాజా రాజకీయ పరిస్థితుల మీద ఒక చిన్న వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. అప్పటివరకు రెండు కుక్కలు ఎదురెదురుగా నిలబడి అరుచుకున్నాయి. తర్వాత ఆ రెండిట్లో ఒక కుక్క బయటకి వెళ్ళిపోయి అద్దంలోంచి మొదటి కుక్కను చూస్తూ మొరుగుతూ ఉంది. ఈ వీడియోని పోస్ట్ చేసి "పొలిటీషియన్స్ లోపల ఒకలా బయటకు ఒకలా ఎలా వుంటారో చూపించే బెస్ట్ విజువల్" అంటూ కాప్షన్ పెట్టాడు. ఇక ఈ వీడియోకి కాప్షన్ కి నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. "నువ్వు వేరే మావ..ఫస్ట్ రౌండ్ వేసినట్టు ఉన్నావ్..నిజాలు మాట్లాడుతున్నావ్...మరి నువ్వెందుకు వ్యూహం సినిమా తీసావు తాగి పడుకోక..ఎక్కడ దొరుకుతాయి మీకు ఇలాంటి వీడియోలు.. రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు..మామూలు సమయాల్లో అందరూ కలిసి నవ్వుకుంటూ ప్రజలను పిచోళ్లను చేస్తారు... ఓ ఇప్పుడు మీరు రాజకీయ నాయకులందరూ కుక్కలు అని అంటున్నారు, మీరు కుక్కలపై ‘వ్యూహం’ అనే సినిమా తీశారు కదా" అంటూ హాట్ హాట్ కామెంట్స్ తో ఆర్జీవీని తిడుతూ మెసేజెస్ చేస్తున్నారు.
![]() |
![]() |