![]() |
![]() |

ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన 'దేవర' వాయిదా పడిందని, ఆ తేదీకి 'ఫ్యామిలీ స్టార్' మూవీ రానుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు సైతం ఓ ప్రెస్ మీట్ లో "ఒకవేళ దేవర వాయిదాపడితే తాము ఏప్రిల్ 5కి వస్తాం" అని చెప్పారు. అయితే తాజాగా 'ఫ్యామిలీ స్టార్'ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో 'దేవర' వాయిదాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కు చేయబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. లుంగీ కట్టుకుని గన్నీ బ్యాగ్, ఆధార్ కార్డ్ తో విజయ్ నడిచి వస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం 'గీత గోవిందం' స్థాయిలో మెప్పిస్తుందేమో చూడాలి.
గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కేయూ మోహనన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |