![]() |
![]() |

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో మరోసారి గ్లోబల్ లెవల్ లో ఎన్టీఆర్ సత్తా చాటుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే కోలీవుడ్ మాత్రం 'దేవర'కు షాక్ ఇచ్చేలా ఉంది.
ఏప్రిల్ లో తమిళ్ నుంచి పలు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. జనవరి 26న విడుదల కావాల్సిన 'తంగలాన్'ను ఏప్రిల్ కి వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అలాగే సూర్య 'కంగువ', కమల్ హాసన్ 'ఇండియన్-2' సినిమాలను కూడా ఏప్రిల్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 'దేవర'పై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశముంది.
విక్రమ్, సూర్య, కమల్ హాసన్ ముగ్గురూ బిగ్ స్టార్స్ కావడంతో తమిళనాట 'దేవర'కు థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. పైగా ఈ ముగ్గురికి తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు సినిమాలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దానికి తోడు 'కంగువ', 'ఇండియన్-2' పాన్ ఇండియా సినిమాలు కావడంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ సహా ఇండియాలోని పలు చోట్ల 'దేవర' కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
![]() |
![]() |