![]() |
![]() |

ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల నడుమ చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్'.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తగినన్ని థియేటర్స్ దొరకనప్పటికీ హౌస్ ఫుల్స్ తో స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో రూ.2.85 కోట్ల షేర్, మొదటి రోజు రూ.5.12 కోట్ల షేర్, రెండో రోజు రూ.4.36 కోట్ల షేర్ రాబట్టిన హనుమాన్.. రెండు రోజుల్లో రూ.12.33 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే రెండు రోజుల్లో నైజాంలో రూ.5.55 కోట్ల షేర్ , సీడెడ్ లో రూ.1.53 కోట్ల షేర్ , ఆంధ్రాలో రూ.5.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.5.30 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.6.95 కోట్ల షేర్ కలిపి.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.58 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రూ.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హనుమాన్.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.13.77 కోట్ల షేర్, రెండో రోజు రూ.10.81 కోట్ల షేర్ రాబట్టింది. నేటితో బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ లోకి ఎంటర్ కానుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది.
'హనుమాన్' మూవీ 2 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.5.55 కోట్ల షేర్
సీడెడ్: రూ.1.53 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.5.25 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.12.33 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.5.30 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.6.95 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల వసూళ్లు: రూ.24.58 కోట్ల షేర్
![]() |
![]() |