![]() |
![]() |

జనవరి 6న హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగాల్సిన గుంటూరు కారం (Guntur Kaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ పోలీసుల అనుమతి నిరాకరణ కారణంగా వాయిదా పడింది. దీంతో గుంటూరు కారం వేడుక ఎప్పుడు ఎక్కడ జరగనుందని తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో పబ్లిక్ ఫంక్షన్లకు అనుమతి ఇవ్వడంలేదు. ఇండోర్ ఫంక్షన్ చేసుకునే అవకాశముంది కానీ, గుంటూరు కారం మూవీ టీమ్ ప్రీ-రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించాలని చూస్తోంది. అందుకే పబ్లిక్ ఫంక్షన్ కే మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో 'గుంటూరు కారం' అనే టైటిల్ కి తగ్గట్టుగానే గుంటూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే జనవరి 9న సాయంత్రం గుంటూరులో వేడుక జరగనుందని సమాచారం.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |