![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం' (Guntur Kaaram). హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
'గుంటూరు కారం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్ ని జెమిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో 'గుంటూరు కారం' స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు రాబట్టడంతో పాటు, ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మహేష్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
![]() |
![]() |