![]() |
![]() |
.webp)
యానిమల్ మూవీతో తెలుగు వాడి సత్తాని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద చాటి చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రెజంట్ ఇండియాలో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ లో సందీప్ కూడా ఒకడు. అలాగే సందీప్ డైరెక్షన్ లో చెయ్యడానికి చాలా మంది హీరోలు కూడా ఆరాటపతున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
సందీప్ లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో చిరంజీవి హీరోయిన్ సాక్షి శివానంద్ కి తన గతం గురించి చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో చిరు వేసుకున్న షర్ట్ ఏ కలరో కూడా సందీప్ చెప్పాడు.అలాగే ఆ సీన్ లో చిరంజీవి అగ్రసివ్ గా సిగిరెట్ కాల్చే సీన్ గురించి కూడా చెప్పి ఆ సీన్ తనకి చాలా ఇష్టమని కూడా సందీప్ చెప్పాడు. ఇప్పుడు సందీప్ చిరు విషయంలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం సందీప్ రెడ్డి కి చిరు అంటే ఎంత పిచ్చి లేకపోతే ఆయన వేసుకున్న షర్ట్ కలర్ కూడా గుర్తుపెట్టుకుంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1997 లో వచ్చిన మాస్టర్ మూవీ అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ సినిమాలో చిరంజీవి వేసుకున్న షర్ట్స్ అప్పట్లో మాస్టర్ షర్ట్స్ గా మార్కెట్లోకి వచ్చి విపరీతంగా అమ్ముడయ్యాయి.అలాగే ఆ సినిమాలో చిరంజీవి నటన కూడా సూపర్ గా ఉంటుంది. ఇప్పటికి మాస్టర్ సినిమా మెగా ఫ్యాన్స్ ఫెవరెట్ మూవీల్లో ఒకటి.
![]() |
![]() |