![]() |
![]() |

కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 27 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగి కొందరు టీమ్ మెంబర్స్ చనిపోవడంతో కొన్నాళ్ళు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. కమల్, శంకర్ వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. ఈ గ్యాప్‌లోనే రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు శంకర్. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ‘ఇండియన్2’ చిత్రాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. దీంతో ‘గేమ్‌ఛేంజర్’ షెడ్యూల్స్‌కి బ్రేక్స్ పడుతున్నాయి. శంకర్ తన పూర్తి కాన్‌సన్‌ట్రేషన్ చరణ్ సినిమాపైనే పెట్టారని, ఇండియన్2 చిత్రాన్ని అతని అసిస్టెంట్స్ డైరెక్ట్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని చిత్ర యూనిట్ ఖండిరచింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన మూడో పార్ట్ షూటింగ్ కూడా కొంత జరిగిందని తెలుస్తోంది. అయితే తాజాగా రెండోపార్టు షూటింగ్ పూర్తయిందంటూ యూనిట్ సభ్యులతో కలిసి కమల్‌హాసన్ దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలో శంకర్ లేకపోవడం అందరికీ అనుమానాన్ని కలిగిస్తోంది. ఇండియన్2కి సంబంధించి ఇప్పటివరకు వస్తున్న వార్తలను నిజం చేస్తూ శంకర్ అసిస్టెంట్స్ షూటింగ్ పూర్తి చేశారా అని అంతా అనుకుంటున్నారు.
ఇండియన్ 2 షూటింగ్ పూర్తవ్వడంతో శంకర్ తన పూర్తి సమయాన్ని గేమ్ చేంజర్ కోసం కేటాయిస్తారని తెలుస్తోంది. గేమ్‌ఛేంజర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు ఎదురుచూస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని బుచ్చిబాబు అనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక గేమ్‌ఛేంజర్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.
![]() |
![]() |