![]() |
![]() |
.webp)
రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా పతాకంపై తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కీడా కోలా. నవంబర్ 3 న థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ మూవీ ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కీడా కోలా ఈ రోజు ఓటిటి లో అడుగుపెట్టింది. ప్రముఖ డిజిటల్ ఛానల్ ఆహా ద్వారా ప్రేక్షకులని కనువిందు చెయ్యడానికి సిద్ధం అయ్యింది. అయితే ఈ ఒక్కరోజు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారు మాత్రమే కీడా కోలా ని చూడగలరు. మిగిలిన రెగ్యులర్ సబ్స్క్రైబర్లు రేపటి నుండి అంటే 29 నుంచి వీక్షించవచ్చు.

థియేటర్ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకొని కీడా కోలా ఓటిటి ప్రేక్షకలని ఎంతగా అలరిస్తుందో చూడాలి. ఈ మూవీలో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘురామ్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని వహించాడు.
![]() |
![]() |