![]() |
![]() |

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మైత్రి మూవీ మేకర్స్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ సంస్థ ఇప్పటి వరకు నిర్మించిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించడంతో పాటు ఆయా హీరోల కెరీర్ లో నెంబర్ వన్ చిత్రాలుగా కూడా నిలిచాయి. వీరు తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేసారు. ఇప్పుడు తాజాగా వీరు మరో సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసే హక్కులని సంపాదించడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనుమాన్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నైజాం ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ వార్త మూవీ లవర్స్ లో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ క్రమంలో తేజ సజ్జ లాంటి చిన్న హీరోకి మైత్రి వారు తోడవ్వడంవలన హనుమాన్ కి ఎక్కువ థియేటర్స్ లభ్యమవుతాయి. దీనితో పండుగ వేళ హనుమాన్ ని అందరు చూసే అవకాశం ఉంటుంది.

హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ మూవీ మీద అందరిలోను అంచనాలు పీక్ లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మూవీ ని చూద్దామా అని చాలా మంది సినీ అభిమానులు కోరుకుంటున్నారంటే హనుమాన్ మానియా ని అర్ధం చేసుకోవచ్చు. తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్లో హనుమాన్ విడుదల కాబోతుంది.
![]() |
![]() |