![]() |
![]() |

చిరంజీవి హీరోగా 2005 లో వచ్చిన సినిమా జై చిరంజీవ. ఈ సినిమాలో పశుపతి క్యారక్టర్ లో నటించిన నటుడి పేరు అర్బాజ్ ఖాన్. ఆ సినిమాలో గన్ డీలర్ గా ఆయన సూపర్ గా నటించారు. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా హిందీలో మాత్రం చాలా సినిమాలు చేసాడు. సుమారు 40 కి పైగా సినిమాల్లో నటించిన అర్బాజ్ వాటిల్లో కొన్ని హీరోగాను కొన్ని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను చేసాడు. మలయాళంలో మమ్ముట్టి తో కూడా కలిసి నటించిన అర్బాజ్ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
సుమారు 17 సంవత్సరాల క్రితం ప్రముఖ నటి డాన్సర్ మలైకా అరోరా ని వివాహమాడిన అర్బాజ్ కొన్నాళ్ల క్రితం ఆమె నుంచి పరస్పర అంగీకారంతో విడిపోయాడు. ఇప్పుడు తాజాగా ఆయన తన స్నేహితురాలైన షూరా ఖాన్ ని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సల్మాన్ ఖాన్ తో సల్మాన్ ఖాన్ తండ్రి మరియు కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. అర్బాజ్ మలైకా ల కొడుకు అర్హన్ ఖాన్ కూడా హాజరయ్యి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
అర్భాజ్ ఖాన్ ఎవరో కాదు స్వయానా సల్మాన్ ఖాన్ కి తమ్ముడు. సల్మాన్ బ్లాక్ బస్టర్ మూవీ దబాంగ్ 2 కి అర్బాజే దర్శకుడు .అలాగే దబాంగ్ 3 కి నిర్మాతగా గాను అర్బాజ్ వ్యవహరించాడు. ఇక అర్బాజ్ మొదటి భార్య మలైకా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ లోని కెవ్వు కేక సాంగ్ లో సూపర్ గా డాన్స్ చేసి అందరి చేత విజిల్స్ వేయించింది.
![]() |
![]() |