![]() |
![]() |
.webp)
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌పై కొన్నిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో తాజాగా దిల్‌రాజు ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధం కావాల్సి ఉంది. ముందు అనుకున్న దాన్ని బట్టి దసరాకే రిలీజ్ ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అది మిస్ అవ్వడంతో 2024 సంక్రాంతికి వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ, ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ విషయంలో అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు నిర్మాత దిల్‌రాజు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న ‘ఇండియన్2’ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్లీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి దానిపై కాన్‌సన్‌ట్రేషన్ పెంచాడు శంకర్. దీంతో ‘గేమ్ ఛేంజర్’ వాయిదా పడుతూ వస్తోంది. దీనివల్ల సానా బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్‌చరణ్ చెయాల్సిన సినిమా కూడా వెనక్కు వెళుతోంది.
తాజాగా ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు దిల్‌రాజు. ఇటీవల ఆడియన్స్‌తో కలిసి ‘సలార్’ సినిమాను చూసేందుకు వచ్చిన దిల్‌రాజును ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు 2024 సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో 9 నెలలు చరణ్ సినిమా కోసం అభిమానులు వెయిట్ చెయ్యక తప్పదు. ఈ నెలాఖరులో మూడు రోజులు షూటింగ్ చేసిన తర్వాత కొన్నిరోజులు బ్రేక్ తీసుకొని కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మార్చి వరకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి చేయాలని దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమాను ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
![]() |
![]() |