![]() |
![]() |

ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే తన డైలాగ్ కి తగట్టు కొంచం లేటుగా వచ్చినా ఇండస్ట్రీ హిట్ కొట్టడం మహేష్ కి వెన్నతో పెట్టిన విద్య. తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో కేవలం తన సినిమా మాత్రమే మాట్లాడుతుంది తప్ప మహేష్ ఎక్కువగా మాట్లాడడు. షూటింగ్ లేనప్పుడు ఫ్యామిలీ తో గడపడానికి ఇష్టపడే మహేష్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మహేష్ కి వీడియో గేమ్స్ ఆడటం అంటే విపరీతమైన పిచ్చని ఖాళీ దొరికినప్పుడల్లా తన కూతురు కొడుకుతో కలిసి విపరీతంగా వీడియో గేమ్స్ ఆడతాడని ఆ విషయంలో నమ్రత చాలా సార్లు మహేష్ ని మందలించి వీడియో గేమ్ పిచ్చిని మాన్పించాలని చూసినా కూడా ఆమె వల్ల కాలేదనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. అలాగే మహేష్ ఉదయాన్నే ఫోన్ కూడా ఎక్కువ సేపు చూస్తాడని ఈ విషయాలన్నింటిని స్వయంగా నమ్రతే చెప్పిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే మహేష్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను విపరీతంగా స్మోక్ చేసేవాడినని ఆ తర్వాత మానేసాని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.
మహేష్ గుంటూరు కారం షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద మహేష్ అభిమానుల్లో సినీ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో రెండు పాటలు ఇటీవలే విడుదల అయ్యి రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకెళ్తున్నాయి. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి లు కథనాయికలుగా నటిస్తున్నారు.
![]() |
![]() |