![]() |
![]() |

ఒక పాత తెలుగు సినిమాలో నటవిరాట్ రావు గోపాలరావు ఒక్కొక్కళ్ళకి ఒక్కో సీజన్ అనే డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు ఆ డైలాగ్ సరిగ్గా యానిమల్ సినిమా విషయంలో రుజువు అవుతుంది. మొన్నటిదాకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేసిన యానిమల్ ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోయింది. పైగా రెండు సినిమాల దెబ్బకి ఒక రికార్డు ని కూడా మిస్ చేసుకుంది.
యానిమల్ సినిమా ఇప్పటివరకు దగ్గర దగ్గరగా 900 కోట్ల రూపాయిల వసూళ్ళని సాధించింది. షారుఖ్ గత చిత్రాలైన పఠాన్, జవాన్ మూవీ సాధించిన 1000 కోట్లని యానిమల్ కూడా సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యే అవకాశాలు కనపడటం లేదు. షారుఖ్ ఖాన్ డంకీ ,ప్రభాస్ సలార్ లు ఒక రోజు వ్యవధిలో థియేటర్స్ లో అడుగు పెట్టాయి. పైగా రెండు కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో యానిమల్ 1000 కోట్ల క్లబ్ కి కొంచెం దూరంలోనే ఆగిపోయింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా,త్రిప్తి లు నటించిన ఈ సినిమాని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన విధానం భారతీయ సినీ ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. మొదట్లో కొంచం డివైడ్ టాక్ వచ్చినా కూడా పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలన్న రీతిలో విడుదలైన అన్ని చోట్ల యానిమల్ విజయదుందుభి మోగించింది.
![]() |
![]() |