![]() |
![]() |

బుల్లి తెర పై జబర్దస్త్ షో తో తనకంటు ఒక పాపులారిటీ ని ఏర్పాటుచేసుకున్న నటి అనసూయ.ఆ షో ఇచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అవకాశాలు పొంది నేడు తన కోసమే దర్శకులు పాత్రలు సృష్టించే స్థాయికి ఎదిగింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు ఎలాంటి విషయం గురించి అయినా దైర్యంగా తన అభిప్రాయాన్ని కూడా తెలియచేస్తుంది. తాజాగా మహిళల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అనసూయ లేటెస్ట్ గా తన ట్విటర్ లో మహర్షి వాల్మీకి రచించిన ఒక వ్యాక్యాన్ని షేర్ చేసింది. వాల్మీకి తాను రచించిన రామాయణంలో భారతీయ స్త్రీ గురించి చాలా గొప్పగా ప్రస్తావించాడు. ఒక స్త్రీని ఇల్లు, దుస్తులు ఇంటి గోడలు,తలుపులు స్త్రీ ని కనపడకుండా మాత్రమే కాపాడగలవు. కానీ వీటన్నిటికంటే ఒక స్త్రీ ని ఆమె క్యారక్టర్ మాత్రమే కవచంలా పని చేసి ఆమెని ఎల్లప్పుడు కాపాడుతుందని చెప్పాడు.
ఇప్పుడు వాల్మీకి చెప్పిన అవే వ్యాఖ్యలని అనసూయ తన ట్విటర్ లో పోస్ట్ చెయ్యడంతో అనసూయ ఎవరినైనా విమర్శిస్తు అలా పోస్ట్ చేసిందా లేక ఆ విధంగా ఉండాలని ఆడవాళ్ళకి చెప్తుందా అని అనుకుంటున్నారు. అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
![]() |
![]() |