![]() |
![]() |

2009 లో వచ్చిన గిల్లి అనే కన్నడ సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసిన నటి రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత మధ్యలో కొన్ని తెలుగు సినిమాలు చేసినా కూడా 2014 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి బిగ్ స్టార్స్ పక్కన నటించి ఆనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక దశలో తెలుగు టాప్ హీరోయిన్ కూడా అవుతుందనుకున్న టైం లో ఒక్క సారిగా హిందీ చిత్ర పరిశ్రమకి వెళ్లిపోయిన రకుల్ ఇప్పుడు తన న్యూ పిక్స్ తో సంచలనం సృష్టిస్తుంది.
రకుల్ తాజాగా ఒక అరటి తోటలో దిగిన తన హాట్ ఫోటోలని విడుదల చేసింది. కుర్రకారు మొత్తం రకుల్ నామ జపంతో ఉగిపోయేలా ఆ పిక్స్ ఉన్నాయి. రకుల్ ని చూసిన వాళ్ళందరు రకుల్ లో ఇంకా అందం తగ్గలేదని అంటున్నారు. తాను ఒంటికి చుట్టుకుంది డ్రస్సో,బెడ్ షీటో తెలియనంత విధంగా రకుల్ ఒక అరటి చెట్టుని హగ్ చేసుకొని తన మత్తెకెక్కించే కళ్ళతో చూస్తుంటే తన చూపుల బాణం నుంచి ఎవరు తప్పుకోలేని విధంగా అవి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
రకుల్ తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాల్లోనే నటించింది.ఆ తర్వాత దక్షిణాది నుంచి హిందీ చిత్ర సీమకి వెళ్ళి కేవలం మూడు సంవత్సరాల్లోనే పది సినిమాలకి పైగా చేసింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి రకుల్ కి సరైన సినిమాలు లేవు. ఇప్పుడు ఆ హాట్ పిక్స్ తో అయినా ఆమెకి మళ్ళీ అన్ని భాషల్లో సినిమాలు వస్తాయేమో చూడాలి.
![]() |
![]() |