![]() |
![]() |

ఇటీవల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కోమటిరెడ్డిని కలిసిన వారిలో దిల్ రాజుతో పాటు.. నిర్మాతలు సురేష్ బాబు, సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు ఉన్నారు.
సినీ ప్రముఖులు త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవనున్నారు. డిసెంబరు 21న జరగనున్న ఈ ప్రత్యేక సమావేశానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో కలిసి సినీ ప్రముఖుల బృందం హాజరు కానుంది.
రాష్ట్ర విభజన తర్వాత నుంచి ప్రభుత్వం తరపున సినిమా అవార్డుల వేడుక జరగడంలేదు. ఈ అంశంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలు సమస్యలను ఈ బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది.
![]() |
![]() |