![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు తన కొత్త చిత్రం పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. విజయ్ నటిస్తున్న ఈ 68 వ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా విజయ్ ఈ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నాడనే ప్రచారం ఉన్న నేపథ్యంలో అందరిలోను ఈ సినిమా మీద ఎనలేని ఆసక్తి ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.
ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త పాన్ ఇండియా లేవల్లో హాట్ టాపిక్ అయ్యింది. పైగా మేకర్స్ ప్రకటించకపోయినప్పటికీ సుదీప్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. అదే కనుక నిజమైతే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం. సుదీప్ కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించాడు. అలాగే తెలుగు,హిందీల్లో కూడా సుదీప్ కి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది.సల్మాన్ హీరోగా వచ్చిన దబాంగ్ 3 తో పాటు నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ మూవీలోను కిచ్చా విలన్ గా చేసి అశేష సినీ ప్రేమికులని ఎంతగానో అలరించాడు.
లియో తర్వాత వస్తున్న ఈ మూవీ మీద విజయ్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి కధానాయికగా చేస్తుండగా ప్రముఖ నటి స్నేహ ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది.
![]() |
![]() |