![]() |
![]() |

నితిన్ హీరోగా,శ్రీలీల హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో మొన్న ఎనిమిదవ తారీఖున వచ్చిన మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ . సినిమా ఆసాంతం కామెడీ గా ఉన్నప్పటికీ కథనంలో ఉన్న కొన్ని లోపాల వలన బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అతి త్వరలో నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటిలో విడుదల కాబోతుంది. వాస్తవానికి సినిమా రిలీజ్ కి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎక్సట్రా ఆర్డినరీ మాన్ ని జనవరి చివరి వారానికి గాని సంక్రాంతికి గాని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ సినిమా విజయవంతం కాకపోవటంతో అనుకున్న టైం కంటే ముందే విడుదల చెయ్యాలని భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగా జనవరి మొదటి వారంలోనే ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ని ఓటిటి లోకి తీసుకొస్తున్నారని తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో అధికారకంగా ఈ విషయాన్ని సదరు సంస్థ తెలియచేసే అవకాశం కూడా ఉంది.
.webp)
నితిన్, శ్రీలీల లతో పాటు సీనియర్ హీరో రాజశేఖర్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించిన ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రానికి హారిస్ జై రాజ్ సంగీత దర్శకత్వం వహించగా శ్రేష్ట్ మీడియా పతాకం పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి అక్క నిఖితా రెడ్డి లు నిర్మించారు. ఈ మూవీలో సినిమా పిచ్చి ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ చాలా అధ్బుతంగా నటించాడు.
![]() |
![]() |