![]() |
![]() |

ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5 రూపొందించిన ఒరిజినల్ మూవీ ‘పేమ విమానం’కు అరుదైన గుర్తింపు దక్కింది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి ఈ చిత్రం ఎంపికైంది. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జైపూర్‌లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుంది.
జ్యూరీ సభ్యులు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఐదు జాతీయ చిత్రాలను, ఏడు ప్రాంతీయ చిత్రాలను, మూడు అంతర్జాతీయ చిత్రాలను ఎంపిక చేశారు. 'ప్రేమ విమానం'తో పాటు తెలుగు నుంచి 'మంగళవారం', 'మధురపూడి గ్రామం అనే నేను' సినిమాలు కూడా ఈ ఫెస్టివల్‌కి ఎంపిక కావటం విశేషం.
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'తో మెప్పించిన సంగీత్ శోభన్ మరోసారి తనదైన నటనతో 'ప్రేమ విమానం' చిత్రంలో అలరించాడు. సంగీత్ కి జోడీగా సావ్వి మేఘన నటించింది. వీరితో పాటు అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తనయులు అనిరుద్, దేవాంశ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. జగదీష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
![]() |
![]() |