![]() |
![]() |
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ అవార్డు కూడా సాధించిన ఈ సినిమాను ఇండియాలోని ప్రేక్షకలు టీవీ, ఓటిటి, స్మార్ట్ ఫోన్.. వివిధ మాధ్యమాల్లో లెక్కనేనన్ని సార్లు చూసేశారు. ఇప్పుడు టీవీలో అడపా దడపా వస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, జపాన్ ప్రేక్షకులు మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని వదిలి పెట్టడం లేదు. గత సంవత్సరం ఈ సినిమా జపాన్‌లో సంచలనం సృష్టించింది. వారికి ఈ సినిమా ఎంత చూసినా తనివి తీరడం లేదట. అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని జనవరి 5న మరోసారి జపాన్‌లో రిలీజ్ అవుతోంది. అయితే ఈసారి ఐమాక్స్ ప్రింట్లతో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎనౌన్స్ చెయ్యగానే అడ్వాన్ బుకింగ్స్‌లో టిక్కెట్స్ విపరీతంగా సేల్ అవుతున్నాయట. జపాన్‌లో ఇప్పటివరకు విడుదలైన ఇండియన్ సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నెంబర్ వన్‌గా ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి జపాన్‌లో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అప్పట్లో ‘ముత్తు’ కలెక్షన్ల విషయంలో అక్కడ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆ రికార్డుని క్రాస్ చేసింది. ఇక బాలీవుడ్ మూవీస్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు కూడా అక్కడ మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’కి అక్కడ అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం రాజమౌళి ఘనతేనని చెప్పాలి. ఈ సినిమా వల్లే నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ హైదరాబాద్ వచ్చినప్పుడు అదే పనిగా టాలీవుడ్ బడా స్టార్లు అందరినీ కలిసారు. కొందరితో ఒప్పందాలు, ప్రతిపాదనలు కూడా జరిగాయి. ఇక ఈ సినిమా అమెరికాలోనూ రెండు నెలలకోసారి షోలు వేస్తున్నారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ వచ్చింది.
![]() |
![]() |